సల్మాన్ ఖాన్ సరసన బంపర్ ఆఫర్

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:50 AM
 

బ్రిటిష్ భామ అమీజాక్సన్ పరువాల హొయల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తెల్లతోలు పిల్ల నాన్ లోకల్ బేబీ కాబట్టి అందాల ఆరబోతకు ఎలాంటి మొహమాటం పడదు. సిల్వర్స్ స్క్రీన్ పై అమీ జాక్సన్ అందాల మాయ, నటన సౌత్ ప్రేక్షకుల బాగా కట్టుకుంటున్నాయి. అందుకే శంకర్ వాటి స్టార్ డైరెక్టర్ అమీజాక్సన్ కు వరుసపెట్టి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అమ్మడి టాలెంట్ ని దక్షణాది వాళ్ళు గుర్తించినంతగా ఉత్తరాది చిత్ర పరిశ్రమ గుర్తించలేదు. బాలీవడ్ లో అమీ చాల తక్కువ చిత్రాల్లో నటించింది. సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ కొట్టేసిందంటూ వస్తున్న తాజాగా న్యూస్ సంచలనంగా మారింది.అమీ జాక్సన్ నటించిన తొలి చిత్రం మదరాసు పట్టణం. తెలుగులో ఈ చిత్రం 1947 ఎ లవ్ స్టోరీగా విడుదలయింది.


తొలిచిత్రంతోనే అమీ జాక్సన్ తన నటనా విశ్వరూపం ప్రదర్శించింది.అమీజాక్సన్ ఐ చిత్రం ద్వారా శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. ఈ చిత్రంలో శంకర్ అమీ జాక్సన్ ని ఎలా చూపించాలి అని భావించాడో అంతే అందంగా చూపించాడు.అమీజాక్సన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఎవడు. ఈ చిత్రంలో అమీజాక్సన్ పాత్ర కొద్ది సేపే అయినా.. అందచందాలతో కుర్రకారు మతి పోగొట్టేసింది.అమీజాక్సన్ ట్రాక్ రికార్డులో చాలా తక్కువగా విజయాలు ఉన్నాయి. ఆమె అందం, అభిమయం ముందు పరాజయాలు పనికి రాలేదు. ప్రతిష్టాత్మకమైన 2.0 చిత్రంలో హీరోయిన్ గా శంకర్ ఏరి కోరి అమీ జాక్సన్ ని తీసుకున్నాడు.


రజిని కాంత్ సరసన 2.0 లో అమీ జాక్సన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.అమీజాక్సన్ తాజాగా మరో బంపర్ అఫర్ దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించబోయే కిక్ 2 చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో దర్శకుడు సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన కిక్ చిత్రం బిగ్ హిట్. హిందీలో ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసారు. అక్కడ కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది.
Recent Post