మహేష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను: మంజుల

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:25 AM
 

నటిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన మంజుల దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆమె దర్శకురాలిగా తెరకెక్కిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తర్‌ జంటగా నటించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పారు


”దర్శకత్వం గురించి ఇంట్లో చెప్పగానే నా భర్త ప్రోత్సహించారు. నాన్నకు విషయం చెప్పగానే థ్రిల్‌ అయ్యారు. మహేశ్‌కు చెప్పగానే ‘నీకేమైనా పిచ్చా’ అన్నాడు. దర్శకత్వం అంటే ఆషామషీనా అన్నట్లు మాట్లాడాడు. నా ఆలోచనలు చెప్పాక తనకు కూడా నాపై నమ్మకం కలిగింది. సినిమా టీజర్‌ విడుదలైన తర్వాత చూసి మహేశ్‌ ఆశ్చర్యపోయాడు. మహేశ్‌తో కూడా సినిమా తీయాలని ఉంది. ‘మంజు నీతో సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అని మహేశ్‌ అనే రోజు కోసం ఎదుస్తున్నా” అని చెప్పుకొచ్చారు.
Recent Post