ఆ వార్తలో నిజం లేదన్న నాని

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:43 AM
 

చలో సినిమా పెద్ద హిట్ కాకపోయినా కామెడి తో పరువాలేదు అనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల తన తరువాతి సినిమా హారికా హాసిని బ్యానర్ లో చెయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి కాని ఆ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ నానితో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి.


ట్విట్టర్ లో నాని ఈ వార్తకు స్పందిస్తూ.. వెంకి కుడుములతో సినిమా చెయ్యబోతునట్లు వచ్చిన వార్తలో నిజం లేదని వెల్లడించాడు. నాని ప్రస్తుతం నిర్మాతగా మారి చేస్తోన్న సినిమా అ ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈ సినిమా తరువాత నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.
Recent Post