అనుష్క‌, వ‌రుణ్ ఫ‌స్ట్ లుక్

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:12 PM
 

వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ‌ర‌త్ క‌ఠారియా తెర‌కెక్కిస్తున్న చిత్రం సుయి ధాగా. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రంలో మౌజీ, మ‌మ‌త పాత్ర‌ల‌లో వ‌రుణ్‌, అనుష్క న‌టిస్తున్నారు. ఈ చిత్రం మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకుంటే, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది. ఈ మ‌ధ్య అనుష్క‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. డీ గ్లామ‌ర్ లుక్ లోను అనుష్క చాలా అందంగా క‌నిపించింది. తాజాగా వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూతికి మీసంతో వ‌రుణ్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తుండ‌గా, అనుష్క శారీ ధ‌రించి చిరున‌వ్వు తో ఫోటోకి ఫోజులిచ్చింది. సెప్టెంబర్ 28న ఈ చిత్ర రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్‌.
Recent Post