నా మేనేజర్‌ తప్పేంలేదు: అమలా పాల్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:35 PM
 

 ప్రముఖ నటి అమలాపాల్‌ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేసియాకు చెందిన ఓ నృత్య పాఠశాల యజమాని అళగేశన్‌ తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని ఇటీవల అమలా పాల్‌ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అళగేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే..అమలను కలవడానికి ఆమె మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ తనకు సాయం చేశాడని అళగేశన్‌ విచారణలో తెలిపాడు.


కానీ తనకు అళగేశన్‌ ఎవరో కూడా తెలీదని ప్రదీప్‌ అంటున్నాడు. అమల కూడా ప్రదీప్‌కే మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసులో మీడియా తన మేనేజర్‌ను తప్పుగా చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు తన మేనేజర్‌కు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా తప్పుడు వార్తలు సృష్టించద్దని వేడుకున్నారు. ‘కొన్ని మీడియా వర్గాలు నా మేనేజర్ ప్రదీప్‌ కుమార్‌‌ గురించి తప్పుగా రాస్తున్నాయి. ఈ కేసు విచారణలో ఉంది. అందుకే మౌనంగా ఉంటున్నాను. కానీ ఇలా తప్పుడు వార్తలు సృష్టిస్తే దావా వేయడానికి కూడా వెనుకాడను.’ అని హెచ్చరించారు.


అళగేశన్‌పై అమల ఫిర్యాదు చేయడంపై కథానాయకుడు విశాల్‌ ఆమెను ప్రశంసించారు. ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్‌ చెప్పారు. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలన్నారు.
Recent Post