ఎస్‌..నా లిస్ట్‌లో గొప్ప మూవీ టెంప‌ర్: పూరీ

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:52 PM
 

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజనం సృష్టించాయి. టాప్ స్టార్స్ తో పూరీ చేసిన సినిమాల‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ఎన్టీఆర్ హీరోగా పూరీ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రానికి విశేష స్పంద‌న ల‌భించింది. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్స్‌లో ఉన్న ఎన్టీఆర్‌,పూరీల‌కి ఈ మూవీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ రోజుతో టెంప‌ర్ చిత్రం రిలీజై మూడు ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.


అంతేకాకుండా టెంప‌ర్‌ సినిమా త‌న మూవీస్ లిస్ట్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అని అన్నాడు. న‌టుడిగా ఎన్టీఆర్ నాకు ఎంతో ప్రేర‌ణ ఇచ్చాడు. ఇలాంటి మంచి క‌థ అందించిన వ‌క్కంతం వంశీకి కృత‌జ్ఞ‌త‌లు అని ట్వీట్ ద్వారా తెలిపాడు. ప్ర‌స్తుతం త‌న త‌న‌యుడు ఆకాశ్ హీరోగా మెహ‌బూబా అనే చిత్రాన్ని చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మూవీకి సిద్ధ‌మ‌వుతున్నాడు. మార్చిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే టెంప‌ర్ చిత్రం బాలీవుడ్‌లోను రీమేక్ అవుతుంది. టెంపర్ ని హిందీలో రోహిత్ శెట్టి రీమేక్ చేయనుండగా, రణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించ‌నున్నాడు. క‌థానాయిక‌గా శ్రీదేవి త‌న‌య జాన్వీని తీసుకోవాలని భావిస్తున్నార‌ట
Recent Post