ఎవ‌రైనా నా డాక్యుమెంట‌రీ తీసుకోవ‌చ్చు..

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:56 PM
 

ప‌ద్మావత్  చిత్ర చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న స‌మ‌యంలో  ఓ రోజు అందరం ఓ దగ్గర కూర్చున్నాం. ఉన్నట్లుండి ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ  నాతో  నీలో మంచి రచయిత్రి ఉన్నప్పుడు నువ్వెందుకు నీ జీవితంలోని ముఖ్య సంఘటనలను డాక్యుమెంటరీగా రూపొందించకూడదని అన్నార‌ని న‌టి దీపిక ప‌దుకొనే తెలిపింది.  ఆయన మాటలకు నాకు ఆశ్చర్యమేసింది. జీవిత గాథను తెరకెక్కించే స్థాయికి నేనింకా చేరలేదు. సినిమాల్లోకి రాకముందు క్రీడారంగంలో ఉన్న నేను నా అభిరుచి మేరకు మోడలింగ్ లో అడుగుపెట్టాను. నేనీ స్థాయికి రావడం వెనక ఎంతో శ్రమపడ్డాను. అదంతా ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదని నాభావన. డాక్యుమెంటరీ విషయంలో ఇప్పటికే ఎంతో మంది నన్ను సంప్రదించారు. పుస్తకాలు రాయడానికి, సినిమాలు తీయడానికి నాదేం గొప్ప చరిత్ర కాదు. నాకంటే గొప్ప వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. మిగతావారితో పోలిస్తే నా జీవితం భిన్నం కాదని నా అభిప్రాయం. అందరితోపాటే నేను కూడా. ఎవరికైనా నా జీవిత గాథ అంత ఆదర్శంగా, ఉత్సాహంగా అనిపిస్తే డాక్యుమెంటరీ తీసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేద‌ని చెప్పింది.
Recent Post