విద్యాబాలన్‌‌కు ముంబై ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 01:00 PM
 

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌‌కు ముంబై ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో కనిపించిన విద్యాబాలన్‌తో ఫొటో దిగేందు అత్యుత్సాహం ప్రదర్శించాడో ఓ అభిమాని. తనపైకి వచ్చి తాకేందుకు ప్రయత్నించిన ఫ్యాన్‌కు విద్యాబాలన్ గట్టిగా మందలించింది. సెల్ఫీ తీసుకోవడానికి ఓ పద్దతి ఉండాలి. అలా మీద పడుతూ అమర్యాదగా ప్రవర్తిస్తావా అని ప్రయాణికుడిపై విద్యాబాలన్ కేకలేసింది. దాంతో అభిమాని కంగుతిని తప్పుకొన్నాడట.  హద్దు మీరి ప్రవర్తించిన అభిమానికి షాకిచ్చిన విద్యాబాలన్‌కు నెటిజన్లు అండగా నిలిచారు. ఇతరు ప్రైవసీకి భంగం కలుగకుండా సెల్ఫీ తీసుకోవాల్సి ఉండాల్సిందని అభిమాని ప్రవర్తను కొందరు తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో విద్యాబాలన్ హుందాగా వ్యవహరించారని ఆమెకు పలువురు కితాబిచ్చారు.
Recent Post