లవర్ ఉండేది, అన్నీ వదిలేసి సినిమాలు చేస్తున్నా

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 01:53 PM
 

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లవ్‌ ఫెయిల్యూర్ మెడికోగా విజయ్ కనబర్చిన నటనకు యువత ఫిదా అయిపోయింది. మరి రియల్ లైఫ్‌లో లవ్ గురించి మాట్లాడితే.. తనకూ ఓ లవర్ ఉండేది. కానీ అన్నీ వదిలేసి సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. జీవితంలో ఎంజాయ్ చేయండి కానీ ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరగొద్దని అబ్బాయిలకు సూచిస్తున్నాడు.


‘లవ్ వద్దూ ఏం వద్దూ.. ప్రేమంటూ అమ్మాయిల వెంట తిరగడం టైం వేస్ట్ వ్యవహారం. బాగా చదువుకొని జీవితంలో సెటిలైతే మంచి లైఫ్ ఉంటుంది, ఆటోమెటిగ్గా మంచి భార్య వస్తుంద’ని కుర్రాళ్లకు సలహా ఇచ్చాడు. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని హితబోధ చేశాడు.ఐఐటీ ఎలాన్, ఎన్‌విజన్ ముగింపు సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రసంగించాడు. కార్యక్రమం చివర్లో ఓ అభిమాని తన మెడలోని పూసల దండను విజయ్ దేవరకొండకు ఇచ్చాడు. అతడి అభిమానానికి ఫిదా అయిన విజయ్.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి అతడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.


ప్రస్తుతం విజయ్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్-2 (జీఏ2), యూవీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఓ చిత్రంలో ఈ యువ హీరో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ‘ఇట్స్ టైం.. ఐ యామ్ బ్యాక్’ అంటూ ఈ పోస్టర్‌ను విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.
Recent Post