ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 10:36 AM



మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈచిత్రంలో సమంత హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన 'వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే' అనే సింగిల్‌ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వయంగా ఆలపించారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ సింగిల్ అందరినీ ఆకట్టుకుంటూ టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com