ప్రేమికుల డే సంద‌ర్భం గా ..రెండో సాంగ్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 11:04 AM
 

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న `నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా`. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది.. మార్చి రెండో తేది నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అలాగే ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగా ఏప్రిల్ 27న కాకుండా ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ర‌చ‌యితగా చిర‌ప‌రిచితుడైన వ‌క్కంతం వంశీ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్నాడు.. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ కాగా విశాల్ – శేఖ‌ర్‌లు సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.. ఇక ఈ మూవీ లోని రెండో సాంగ్  లవ్వర్ ఆల్ సో..ఫైటర్ ఆలో సో ను  చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ప్రేమికుల డే సంద‌ర్భం గా అల్లు అర్జున్, అనూ ఇమాన్యుయేల్ ల మ‌ధ్య చిత్రీకరించిన ఈ ల‌వ్ సాంగ్ అంద‌ర్ని అక‌ట్టుకునేలా ఉంది.. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని శేఖర్ ఆలపించారు.  మీరూ ఈ సాంగ్ ను వినండి..Recent Post