కుర్రకారుకు మత్తెక్కిస్తున్న మలయాళం సాంగ్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 11:30 AM
 

గూగుల్ అన‌లిటిక్స్‌లో స‌న్నీ లియోన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకోనేలు ఈ 18 ఏళ్ళ అమ్మాయి త‌ర్వాతి స్థానాల‌లో నిలవ‌డం విశేషం. అయితే ఈ రోజు వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ప్రియా డెబ్యూ మూవీ ఓరు అదార్ లవ్ చిత్రంలోని 44 సెక‌న్ల టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. కోస్టార్ రోష‌న్ అబ్ధుల్‌తో ప్రియా ప్ర‌కాశ్ క‌న‌బ‌రచిన క్యూట్ అండ్ ల‌వ‌బుల్ ఎక్స్‌ప్రెష‌న్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ టీజ‌ర్‌తోను ప్రియా యూత్ గుండెల్లో బుల్లెట్ దించింది . ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే టీనేజ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కింది. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లోకి రానుంది. Recent Post