ఫొటోషూట్స్ అంటే చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపేది లేదు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:03 PM
 

ప్రస్తుత రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం స్టైలిష్ అండ్ హాట్ లుక్స్ లో కనిపిస్తూ ఫొటో షూట్స్ ఇస్తున్నారని టాక్ బాగా వస్తోంది. అందులో నిజం లేకపోలేదు. హాట్ గా కనిపిస్తే కుర్రకారు ఫోటోని చూడకుండా ఉండలేరు. ఫ్యాషన్ వరల్డ్ లో వివిధ డ్రెస్సుల్లో హావభావాలు సెక్సీగా చూపిస్తే కుర్రకారు షేర్ చేసుకునే దాకా వదలడం లేదు. దీంతో దర్శకనిర్మాతలకు ఆ ఫార్ములాను పట్టుకొని హాట్ ఫొటోస్ తో వైరల్ అయిన హీరోయిన్స్ ని సినిమాకి ఎంచుకుంటున్నారు.


అదే తరహాలో ముందుగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన బ్యూటీ సీరత్ కపూర్. అమ్మడి హాట్ ఫొటో షూట్స్ ని చూసే అందరు షాక్ అయ్యారు. అనంతరం ఆమెకు వరుసగా మూడు సినిమాల్లో అవకాశం దక్కింది. గ్లామర్ పాత్రల కోసం సీరత్ ని బాగానే వాడుకున్నారు. అయితే ఫొటో షూట్స్ వల్ల ఆఫర్స్ దక్కించుకున్న బ్యూటీ అనే ముద్ర సీరత్ కి పడిపోయింది. దీంతో ఆ మాటకు అమ్మడు చాలా ఆవేశానికి లోనవుతోందట. ఈ రోజుల్లో ఫొటో షూట్స్ ఇవ్వడం చాలా కామన్. ఎవరైనా ఇస్తుంటారు. మోడలింగ్ లో అది కూడా ఒక భాగమే.


అందం వల్ల నటన వల్ల అవకాశాలు వస్తాయేమో గాని ఫొటో షూట్స్ వల్ల కాదు. దయచేసి ఇలాంటి ట్యాగ్ లైన్లు ఇచ్చేయకండి అని అమ్మడు చాలా కోప్పడుతోంది. ఇక తనకు ఫొటోషూట్స్ అంటే చాలా ఇష్టమని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపేది లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సీరత్ చేతిలో ఆఫర్స్ పెద్దగా ఏమి లేవు. ఆమె చేసిన గత సినిమాలన్నీ ఏ మాత్రం లాభాన్ని ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.
Recent Post