అందంతో నెటీజన్స్ మతి పోగొడుతోన్న ప్రియాంక

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:08 PM
 

గత కొంత కాలంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అని  గుర్తింపు తెచ్చుకుంటున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో ఆ పిలుపుకు దూరం అవుతుందేమో. ఎందుకంటే అమ్మడు ఇస్తోన్న స్టిల్స్ అలా ఉన్నాయి మరి. మొన్నటి వరకు కేవలం ఇండియాలోనే తన అందాలతో అందరిని ఆకర్షించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పరదేశి సినీ ప్రియులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. హాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక ఓ రేంజ్ లో నటిస్తోంది. దీంతో వరల్డ్ బ్యూటీ అని మరో టైటిల్ ను సొంతం చెసుకుంటుందేమో.


దీంతో అమ్మడి గ్లామర్ ని కొందరు ప్రపంచ మంతా మ్యాగజైన్ ల ద్వారా పరిచయం చేస్తున్నారు. రీసెంట్  గా బజార్ మ్యాగజైన్ వియత్నాం ఎడిషన్ కి ఇచ్చిన ఫొటో స్టిల్స్ ఎంత ఘాటుగా ఉన్నాయో మాటల్లో చెప్పడం చాలా కష్టం. మెరుస్తోన్న ఒక రెడ్ ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్ కొంటె కోరికలను రేపుతోందని ఓ రకంగా కామెంట్స్ వినపడుతున్నాయి. అంతే కాకుండా దానికి తోడు క్లివేజ్ షో చూపరులకు కనువిందు చేసేలా ఉంది. అలాగే ప్రియాంక చూపులకు కూడా మార్కులు వేయాల్సిందే.


ఇలా తన అందంతో నెటీజన్స్ మతి పోగొడుతోన్న ప్రియాంక వరల్డ్ ఫేమస్ బ్యూటీ అనే రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆమె ఫొటో షూట్ కోసం ఎంతో మంది ఫ్యాషన్ నిపుణులు వర్క్ చేస్తున్నారు. ఇక అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ లో రెండు సినిమాలు ఒక సీరియల్ చేసుకుంటూ బిజీగా వుంది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.
Recent Post