నాగార్జున, నానిల మల్టీ స్టారర్లో కన్నడ హీరోయిన్ ?

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:57 PM
 

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, యంగ్ హీరో నానిలు కలిసి ఒక మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో కన్నడ స్టార్ నటి శ్రద్దా శ్రీనాథ్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె ఈ సినిమాపై సుముఖంగా ఉన్నారట. అయితే ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ మీద సైన్ చేయలేదని సంచారం. శ్రద్దా శ్రీనాథ్ ‘విక్రమ్ వేద’ వంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులకి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే.
Recent Post