స్టేజ్ పై సుధీర్ పరువు తీసిన రోజా..

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 05:08 PM

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ షోస్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకుంటూ.. ఎప్పుడు నెంబర్ వన్ షోగా దూసుకెళ్లేదుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. ఐదేళ్ల నుంచి పాట పాడుతున్నానండీ అని సింగర్ అంటే.. అంత పెద్ద పాట ఎవడిచ్చాడయ్యా నీకు అంటూ రాకింగ్ రాకేష్ పంచ్ వేశాడు. అలానే పొట్టి రమేష్ పెళ్లి ఎపిసోడ్ బానే నవ్వించేలా ఉంది.
ఇక 'ఇక్కడ రౌడీయిజం నేర్పబడును'.. అంటూ మాదాపూర్, కొండాపూర్ రౌడీలుగా ఎంట్రీ ఇచ్చారు సుధీర్, ఆటో రాం ప్రసాద్‌లు. నువ్వు రౌడీలా లేవే అని రాం ప్రసాద్.. అనుమానం వ్యక్తం చేయడంతో.. నేను రౌడీలా లేకపోవడం ఏంటి మంచి సెటిల్ మెంట్లు చేస్తా.. మొన్న ఒకడు ఇద్దర్ని పెళ్లి చేసుకున్నాడు అంటూ తాను చేసిన సెటిల్ మెంట్ గురించి సుధీర్ ప్రారంభించగా.. 'అందులో ఒకర్ని సుధీర్ లాగేశాడు' అంటూ పంచ్ వేశారు జడ్జీ మనో. ఒకవేళ నలుగులు పెళ్లాలు ఉంటే అని యాంకర్ రష్మి ప్రశ్న వేయగా.. ఒకటి వాళ్లకి ఇచ్చేసి మూడు సుధీర్ తీసుకుంటాడు అంటూ అదిరిపోయే పంచ్ వేసింది రోజా.
ఇక వీళ్లకు 'తేడా' గురువుగా గెటప్ శీను కామెడీతో అదరగొట్టేశాడు.. డబ్బులు ఎలా వసూలు చేయాలో సుధీర్‌ని నేర్పిస్తూ పొట్టచెక్కలు చేశాడు. ఇక చివర్లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పోలీస్‌లు పడుతున్న తిప్పల్ని ఎమోషనల్‌గా చూపించడం కోసం పోలీస్ అవతారం ఎత్తాడు షకలక శంకర్. బిర్యానీ కోసం రోడ్ల మీదకి వచ్చేవాడి తాట తీసి భారీ డైలాగ్‌తో అలరించి జడ్జీలతో చప్పట్లు కొట్టించుకున్నాడు శంకర్. ఆ ప్రోమోను మీరు కూడా చూడండి.
Recent Post