శేఖర్ కమ్ముల ఇంట విషాదం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 07:23 PM

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువు‌రు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ లో ప‌రామ‌ర్మించారు. శనివారం సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో శేఖ‌ర్ క‌మ్ముల తండ్రి అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా 'లవ్ స్టోరీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది.
Recent Post