ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కోసం పవర్ ఫుల్ స్టోరీ..

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 03, 2020, 11:12 AM



కొన్ని కాంబినేషన్స్ సినిమా అని ఎనౌన్స్ చేయగానే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఎనౌన్స్ మెంట్ దగ్గర నుండి రిలీజ్ వరకు అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి త్వరలో రాబోతుంది. ఇంతకీ ఆ కాంబో ఏంటి అంటే గబ్బర్ సింగ్ కాంబో అని తెలుస్తుంది. ఖుషి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్టు పడి పదేళ్ళు గ్యాప్ వచ్చింది.. అలాంటి టైంలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకునేలా చేసింది.
గబ్బర్ సింగ్ లో పవన్ స్టైల్, దేవి శ్రీ సాంగ్స్, హరీష్ శంకర్ డైరక్షన్ అబ్బో మాములుగా ఉండవు. ఆ సినిమాతో మళ్ళీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ తో పనిచేయలేదు. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందట. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయ్యిందట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఆల్రెడీ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో మరోసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడట పవన్ కళ్యాణ్. ఈ కాంబో సినిమానే క్రేజీగా ఉంటే సినిమాలో పవన్ పోలీస్ అనగానే మరింత అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి గబ్బర్ సింగ్ సీక్వల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు పవన్. మరి హరీష్ శంకర్ తో సెకండ్ ప్రాజెక్ట్ ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com