ఆ విషయంపై 'మెగాఫ్యాన్స్'లో నిరాశ..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 11:55 AM

ఈ ఏడాది ఉగాది పర్వదినం నుండి ట్విట్టర్ ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా మన తెలుగు సినీ హీరోలు హీరోయిన్లు అంతా కూడా ఏదొక మీడియా మాధ్యమంలో ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటారు. వారి అభిమానులతో పంచుకోవాల్సిన విషయాలను పంచుకుంటారు. దాదాపుగా చిన్న హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరై.. ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. మెగాస్టార్ ఇంతకాలం తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు. ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియాలో కనిపించడం అభిమానులకు పెద్ద పండుగే అయిపోయింది. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి అభిమానులతో తన కొత్త సినిమాల విషయాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే అభిమానులు ఒక విషయంలో మాత్రం నిరాశగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటంటే.. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు మెగాస్టార్. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ అభిమానులు మాత్రం మెగాస్టార్ - కొరటాల శివ కాంబినేషన్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్నారు. అందుకే అప్డేట్స్ వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో ఆచార్య టైటిల్ తో హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టైటిల్ పై అయినా క్లారిటీ ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.


ఈ నెల 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ఈ మధ్య రికార్డుల గోల ట్రెండ్ అవుతోంది. అభిమానులు తమ హీరోల హ్యాష్ ట్యాగ్ లతో కామన్ డీపీలతో హోరెత్తిస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజిలో ట్విట్టర్లో హల్చల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. మెగాస్టార్ కామన్ డీపీని ఓ ప్రముఖ సెలబ్రిటీ చేత లాంచ్ చేయనున్నారని సమాచారం. అలాగే మెగాస్టార్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నా అసలు సినిమా టైటిల్ ఏంటి? తదుపరి సినిమా విషయం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి మెగాస్టార్ తన బర్త్ డే సందర్భంగా సినిమాల పై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో..!
Recent Post