పెళ్లి పీటలెక్కిన సాహో డైరెక్టర్ సుజీత్..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 12:35 PM

రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సుజీత్ ఇటీవల సాహో అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సాహో చిత్రం సుజీత్ క్రేజ్‌ని దేశ స్థాయికి వరకు తీసుకెళ్ళింది. త్వరలో ఆయన చిరుతో లూసీఫర్ రీమేక్ చేస్తాడని భావించగా ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారు. దీంతో శర్వానంద్ లేదా గోపిచంద్‌తో మూవీ చేయనున్నారని సమాచారం. అయితే ఇటీవల తన ప్రేయసి ప్రవల్లికతో గోల్కొండ రిసార్ట్స్‌లో నిశ్చితార్ధం జరుపుకున్న సుజీత్ ఆగస్ట్ 2న కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి పీటలెక్కినట్టు తెలుస్తుంది.
సుజీత్, ప్రవల్లిక పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు గత రాత్రి నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా, ప్రస్తుతం స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తుంది. టిక్ టాక్ వీడియోలలో ఆమె బాగా ఫేమస్ అట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే తన పెళ్ళికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయకపోవడంతో సుజీత్‌ అభిమానులు షాక్ అవుతున్నారు.
Recent Post