మరో మలుపు తిరిగిన సుశాంత్ కేసు

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 01:22 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు కాగా లేదు ఆయనది హత్య అని మరికొంత మంది ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ముందు నుంచి కూడా సుశాంత్ ది హత్య అని వాదిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పలు ఆధారాలు బయటపెడుతూ ఈ కేసులో ఆయన సంచలనం సృష్టిస్తున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా మరో వీడియోను ఆయన పోస్టు చేశారు. రక్షణశాఖ ఆర్డనెన్స్ ఆస్పత్రిలో పని చేసే మహిళా డాక్టర్ మీనాక్షిమిత్రా వీడియోనే ఆయన షేర్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని,కొట్టి చంపారని ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె వెల్లడించారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో పాట్నా పోలీసులు ఈ కేసులో వేగం పెంచారు. మరో వైపు ముంబై పోలీసులు కూడా ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోవడం చర్చనీయాంశమైంది.
Recent Post