విరిగిన గులాబీని పట్టుకుని దీనంగా ఉన్న నిఖిల్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 01:09 PM
 

నిఖిల్‌, సిమ్రన్‌ పరీన్జా, సంయుక్తా హెగ్డే నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం కిర్రాక్‌ పార్టీ. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై షరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న‌ది.. వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఇక వాలంటైన్స్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఒక పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విరిగిన గులాబీని పట్టుకుని దీనంగా ఉన్న నిఖిల్ ఫోటోను ఈ పోస్ట‌ర్ లో ఉంచారు.. మీరూ ఆ ఫోటోను చూడండి.


ఈ చిత్రానికి మాటలు: చందు మొండేటి, స్క్రీన్‌ప్లే: సుధీర్‌వర్మ, కెమెరా: అద్వైత గురుమూర్తి, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిరణ్‌ గరికిపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌.


 


 
Recent Post