రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ నిర్మాత...?

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 02:11 PM

టాలీవుడ్ లో రాజమౌళి సినిమా అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆయనతో సినిమా చేయడానికి గానూ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన తో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే పరిస్థితిలో చాలా మంది స్టార్ హీరోలు ఉంటారు. ఆయనతో ఒక్క సినిమా చేసి హిట్ అయింది అంటే లక్ ఒక రేంజ్ లో ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లో చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయనతో సినిమా చేయడానికి గానూ టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు అని కథనాలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని... ఆయనతో బాలీవుడ్ లో ఒక స్టార్ నిర్మాత ఒకరు చర్చలు జరుపుతున్నారు.
అక్కడ ఒక చారిత్రాత్మక కథ ఉన్న సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని టాక్. జక్కన్న కు సినిమాలో వాటానే కాకుండా రెమ్యునరేషన్ కూడా ఇస్తాను అని సదరు నిర్మాత ముందుకు వచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు జక్కన్న తెలుగులో చేస్తున్న సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఎప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుంది అనేది చూడాలి. వచ్చే ఏడాది చివర్లో అని టాక్.
Recent Post