చిరంజీవికి రాఖీ కట్టిన చెల్లెళ్లు..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 05:03 PM

మెగాస్టార్‌ చిరంజీవి తన కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలను, తన సినిమా జ్ఞాపకాలను, తాజా అప్‌డేట్‌లను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
''నా చెల్లెళ్లిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.'' అని రాసుకొచ్చారు. మెగాస్టార్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను చేస్తున్నారు. దీని తరువాత యువ దర్శకులతో వరుసగా సినిమాలను కమిట్‌ అవుతూ బిజీగా గడుపుతున్నారు. 


 
Recent Post