గుర్తు ప‌ట్ట‌లేనంతగా మారిపోయిన ప‌వ‌న్ హీరోయిన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 01:26 PM
 

2001లో మ‌ల‌యాళ చిత్రం ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. అమ్మాయి బాగుంది అనే చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఈ చిత్రం అమ్మ‌డికి పెద్ద‌గా పేరు తీసుకు రాలేదు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన గుడుంబా శంక‌ర్‌లో క‌థానాయిక‌గా న‌టించి అందరి దృష్టి ఆక‌ర్షించింది మీరా జాస్మిన్‌. ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన భ‌ద్ర‌లోను న‌టించింది. ఈ చిత్రం త‌ర్వాత తెలుగు సినిమాల‌కి దూరంగా ఉన్న మీరా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసింది. ఇక పెళ్ళి త‌ర్వాత కేవలం మ‌ల‌యాళ భాషలోనే కొన్ని సినిమాలు చేసి, 2016 లో సినిమాల‌కి గుడ్ బై చెప్పింది. పాతు క‌ల్ప‌న‌క‌ల్ అనే మ‌ల‌యాళ చిత్రం మీరా జాస్మిన్ కెరియ‌ర్‌లో చివ‌రి చిత్రం. తాజాగా ఈ అమ్మ‌డు జ్యూయ‌ల‌రీ షాప్‌లో త‌ళుక్కుమంది. చీర‌క‌ట్టులో చాలా బొద్దుగా కనిపిస్తున్న మీరాని చూసి అంద‌రు షాక్ అయ్యారు. నాజూకుగా ఉన్న మీరా బొద్దుగా మారే స‌రికి అభిమానులు కాస్త దిగాలు చెందుతున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మడి ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
Recent Post