స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త‌తో వ‌రీనా హుస్సేన్‌..

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 02:44 PM
 

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ రీసెంట్ గా తన ట్విట్టర్ లో ముజే లడఖీ మిల్ గయే ( నాకు అమ్మాయి దొరికింది) అంటూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ట్వీట్‌తో నెటిజ‌న్స్ సల్మాన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని అనుకున్నారు. కాని కొద్ది సేప‌టి త‌ర్వాత తనకి దొరికిన అమ్మాయి సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ లో రూపొందబోయే లవ్ రాత్రి సినిమా కథానాయిక వరీనా హుస్సేన్‌ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త ఆయుశ్ శ‌ర్మ హీరోగా న‌టిస్తున్నాడు. అభిరాజ్ మినవాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌రొమాంటిక్ డ్రామా ఫ‌స్ట్ లుక్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఎంతో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబర్ 21, 2018న ఈ మూవీ విడుద‌ల కానుంది.
Recent Post