సమంత ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:09 PM

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సమంత అక్కినేని హీరోయిన్. ఈ సినిమాలోని 'యాంగ్రీ బర్డ్' సాంగ్ వీడియో ప్రోమోని చిత్రబృందం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.ఈ వీడియోలో షూటింగ్‌ చేస్తుండగా జరిగిన ఫన్నీ సన్నివేశాలను కూడా జత చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. సమంత ఎలా నడుస్తుందో విశాల్ చూపించి చిత్రబృందాన్ని నవ్వుల్లో ముంచెత్తారు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

 


 
Recent Post