ఎప్పుడూ ఫ్యాషన్ గా కనిపించి విసుగు వచ్చిందేమో చీర కట్టులో మెరిసిపోయింది అందాల భామ ‘ఊర్వశిరౌతెల్లా’. హేట్ స్టోరీ, సనమ్ రే వంటి చిత్రాల్లో తన నటనతో ఫాలోవర్లను పెంచుకున్నారు ఉత్తరాది భామ ఊర్వశి రౌతెల్లా. రీసెంట్ గా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిందీ భామ. రక్షాబంధన్ సందర్భంగా చీరకట్టులో మెరుస్తూ..తన సోదరుడికి రాఖీ కట్టింది. రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పి మిఠాయి తినిపించింది. పర్పుల్ కలర్ సారీ, బ్లౌజ్ కాంబినేషన్ లో చక్ చక్ మని మెరిసే చీరకట్టులో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫొటోకు 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఊర్వశి ఎందరి మనసులు దోచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.