ఫస్ట్ లుక్ విడుదల.... ఐశ్వ‌ర్య అదుర్స్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 04:10 PM

అందాల తార ఐశ్వ‌ర్యారాయ్  నటిస్తున్న  బాలీవుడ్ మూవీ ఫన్నే ఖాన్.  ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్న కెఏ ఎంటర్టెన్మెంట్స్ వారు ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. 40 ప్లస్ వయసులోనూ ఐష్ ఇంత హాట్ అండ్ సెక్సీ లుక్‌లో కనిపించడం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. .ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. సినిమాలో చాలా పాటలుండబోతున్నాయి. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తో పాటు న‌టుడు  అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో కనిపించబోతున్నాడ‌ట‌.


 
Recent Post