నాగచైతన్య కొత్త హీరోయిన్..కిల్లింగ్ లుక్స్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 04:20 PM
 

బాలీవుడ్ లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి నిధీ అగర్వాల్. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఆ సినిమా ఆడలేదు. అయినప్పటికీ.. నిధికి మాత్రం మంచి గుర్తింపే దక్కింది. ఎంతగా అంటే.. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈమె దక్షిణాదిన అవకాశాలను ఒడిసిపట్టుకుంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


తొలి సినిమా సరిగా ఆడకపోయినా... ఉత్తరాదిన ఫెయిల్ అయినా, దక్షిణాదిన నిధి అవకాశాన్ని పొందడం గమనార్హం. ఈ నేఫథ్యంలో సోషల్ మీడియా ద్వారా నిధి మరింత ఫాలోయింగ్ సంపాదించుకునే పనిలో పడింది. అందుకోసమే ఈ తరహాలో హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది ఈ భామ.


తన బోల్డ్ అవతార్ తో, కిల్లింగ్ లుక్స్‌తో, మొహమాటం లేని ఎక్స్ పోజింగ్ తో తన ఇన్ స్టాగ్రమ్ ఫాలోయర్లతో లవ్ యూ కామెంట్లు పెట్టించుకంటోంది నిధీ అగర్వాల్. మరి తన తొలి సినిమాకు ముందే.. నిధి ఈ విధంగా తెలుగు వాళ్లను కూడా పలకరిస్తోంది. ఫస్ట్ సినిమా వచ్చాకా.. టాలీవుడ్ లో ఈమె ఎలాంటి అవకాశాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.
Recent Post