అక్కతో చేస్తే అదే ఆఖరు సినిమా

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 15, 2018, 12:04 PM
 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా చేసిన ‘అతడు’సినిమాను మహేష్ అభిమానులెవరూ అంత తేలిగ్గా మరిచిపోరు. అందులో మహేష్ సైలెంట్ గా కనిపిస్తాడు. కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా పంచ్ లు వేస్తూ అందరినీ తెగ ఉడికించేస్తాడు. ఈ క్యారెక్టర్ కాస్త మహేష్ రియల్ లైఫ్ కు దగ్గరగానే ఉంటుంది. రీసెంట్ గా మహేష్ పంచ్ దెబ్బ అతడి అక్క మంజులకు కాస్త గట్టిగానే తగిలింది. కొత్త గా డైరెక్టర్ అవతారం ఎత్తిన మంజుల సందీప్ కిషన్ హీరోగా ‘మనసుకు నచ్చింది’సినిమా పూర్తి చేసింది. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇందుకు కారణం అతడి అక్కేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంజుల ఆంటీ డైరెక్షన్ లో  సినిమా ఎప్పుడు చేస్తావని మహేష్ కొడుకు గౌతమ్ అడగ్గా... ‘‘మీ ఆంటీతో చేస్తే అదే నా ఆఖరు సినిమా’’ అంటూ వెంటనే పంచ్ వేసేశాడట. ఈ విషయం మంజులే స్వయంగా బయటపెట్టింది. 


మంజుల యాక్టర్ గా మొదటి సినిమాతోనే అదరగొట్టేసింది. నిర్మాతగా బ్లాక్ బస్టర్ తీసిన చరిత్ర సొంతం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా డైరెక్షన్ కూడా పూర్తి చేసింది. ఇందులోనూ రాణిస్తే తండ్రి తగ్గ తగిన కూతురనే కీర్తి సొంతమవుతుంది. తమ్ముడితో సినిమా చేయడానికి కావలసిన ధైర్యమొచ్చేస్తుంది. ఫ్యూచర్లో అక్కతో సిినిమా చేసే అవకాశం ఉందని మహేష్ ఇప్పటికే చెప్పాడు. 
Recent Post