గెస్ట్ రోల్ కు కాజల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 04:56 PM

వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. 


ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ సినిమా హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో `అరణ్య` పేరుతో రిలీజ్ కానుంది. 
Recent Post