సీనియర్ దర్శకుడు ఎన్.బి. చక్రవర్తి మృతి...

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 06:07 PM

సీనియర్ దర్శకుడు ఎన్.బి. చక్రవర్తి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. టాలీవుడ్‌లో ఆయన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. శోభన్‌బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’.. రాజేంద్రప్రసాద్, రాజశేఖర్‌లతో ‘కాష్మోరా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చక్రవర్తి మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తున్నారు.
Recent Post