వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను: ఉపాసన

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 06:32 PM

ఇది శ్రావణమాసం కావడంతో మహిళలకు ప్రతి దినమూ పవిత్రమైనదే. వరలక్ష్మి అమ్మవారికి రకరకాల పూజలు, నైవేద్యాలతో పూజాదికాలు, ఆరాధనలు నిర్వహించడం ఈ మాసంలో సాధారణమైన విషయం. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కూడా వరలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా  ద్వారా వెల్లడించారు.


"వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను. అందుకు రామ్ చరణ్ కు, మా అత్తమ్మకు, డాక్టర్ సంగీతారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పూజను ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఎంతో సంతృప్తిగా ఉంది. మనందరిపైనా ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
Recent Post