నేడు సూపర్ స్టార్ మహేష్ 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను వరల్డ్ వైడ్ మహేష్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. కాగా ఫ్యాన్స్ కోసం మహేష్ నేడు ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ తో వచ్చేశారు. రూపాయి కాయిన్ ని గాలిలోకి ఎగరేస్తున్న మహేష్ సినిమా పై ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ మూవీ నేపథ్యం అంతా మనీ చుట్టే తిరుగుతుందని నేటి మోషన్ పోస్టర్ కానీ, టైటిల్ డిజైన్ కానీ తెలియజేస్తున్నాయి.