ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ గా మారిన నమ్రత పోస్ట్..

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 11:59 AM



2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాలో కలిసి నటించిన నమ్రత-మహేష్ బాబు 2005లో పెళ్లితో ఒకటయ్యారు. అప్పటినుండి టాలీవుడ్ లోని ఆదర్శ జంటలో ఒకరిగా వీరు నిలుస్తున్నారు. అయితే ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన 45 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో... ''నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది నేను నీతోనే అనుభవించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తుంటాను'' అని తెలుపుతూ మహేష్ తనకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇక మహేష్ బర్త్ డే ను ఆయన అభిమానులు గత 10 నుండి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ లో ప్రస్తుతం మహేష్ ట్యాగ్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com