సూపర్‌స్టార్ మహేశ్ పుట్టినరోజు నేడు(ఆగస్ట్ 9). ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్‌స్టార్ మహేశ్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
మరో వైపు వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవడమే కాకుండా.. వరల్డ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ మహేష్ పేరిట నమోదైంది. ఇప్పటి వరకు ఈ హ్యాష్ ట్యాగ్ పేరిట 25 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. మరెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.