అక్కినేని యువ హీరో అఖిల్ దురదృష్టం ఏమిటో గాని ఎంత కష్టపడినా ఒక్క హిట్టు కూడా పడటం లేదు. ఏదైనా ఒక కమర్షియల్ సక్సెస్ తరువాత ప్రయోగాలు చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ సేఫ్ జోన్ లో సక్సెస్ దక్కడం లేదు. సినిమాల ప్రమోషన్స్ కి హీరోల క్రేజ్ ని వాడుకున్నా కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఎలాగైనా నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో సక్సెస్ కొట్టాలని రెడీ అవుతున్నాడు.
ఎప్పుడో సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూనే ఉంది. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్ అయినా కూడా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే అఖిల్ మాత్రం నమ్మకంతో సంక్రాంతికి థియేటర్స్ రానున్నట్లు పోస్టర్ ని రిలీజ్ చేశాడు. పోస్టర్ సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అయ్యింది.|
ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలని చిత్ర యూనిట్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో సమంత ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
కథ కూడా అమెతోనే మొదలవుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. గతంలో నాగార్జున సినిమాలో కూడా అతిధి పాత్రలో మెరిసిన సమంత ఇప్పుడు మరిది కోసం కూడా తన స్టార్ డమ్ ని పక్కనపెట్టి చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.