అమితాబ్ కు జాబ్ ఆఫర్...!

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 10, 2020, 03:39 PM

కరోనా బారి నుంచి బ‌య‌టప‌డిన‌ బాలీవుడ్ సీనియ‌ర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్ర‌స్తుతం తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమితాబ్ మ‌రోమారు అభిమానుల‌కు ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ అమితాబ్ కరోనా కారణంగా త‌న‌కు ప‌ని దొరుకుతుందో లేదోన‌ని సోష‌ల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తనకు జాబ్ ఆఫర్ వచ్చింద‌ని అమితాబ్ ఆనందంగా తెలిపారు. కాగా 65 ఏళ్లు పైబడిన నటులు టీవీ, సినిమా షూటింగ్‌ల‌లో పాల్గొన‌కూడ‌ద‌ని మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వులను వివక్షపూరిత‌మైన‌విగా కోర్టు పేర్కొంది. ఇదిలావుండ‌గా  బిగ్‌బీ అభిమానులలోని ఒకరు అతనికి జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని అమితాబ్ తన బ్లాగులో తెలియ‌జేశారు. ఇప్పుడు త‌న‌ ఉద్యోగం ప‌క్కా అయింద‌ని అని అమితాబ్ దానిలో రాశారు.
Recent Post