ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిగ్ బాస్ సీజన్ 4' కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 05:04 PM



బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఆగష్టు 29, 30 తేదీల్లో బిగ్ బాస్ షో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే కోవిడ్ వలన పనులు ముందుకు సాగకపోవడంతో మరికొంత సమయం ఆలస్యం అయినా ఆశ్చపడాల్సిన పనిలేదు. ఇప్పటికే సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాగా.. మొత్తం 16 కంటెస్టెంట్స్ సీజన్ 4లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే 106 రోజుల పాటు బిగ్ బాస్ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హోస్ట్ విషయానికి వస్తే.. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. అయితే తెలుగులో బిగ్ బాస్ హోస్ట్‌గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హోస్ట్‌గా నాగార్జునకి రికార్డ్ ఉంది. సీజన్ 3కి రూ.5 కోట్లు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బుల్లితెర హిస్టరీలో ఒక హోస్ట్‌కి ఈ రేంజ్ రెమ్యునేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి. సీజన్ 1కి హోస్ట్ చేసిన ఎన్టీఆర్‌కి అప్పట్లో రూ. 2.5 కోట్లు అని టాక్. ఇక సీజన్ 3కి హోస్ట్ చేసిన నానికి రూ.3 కోట్లని వినికిడి. అయితే సీజన్ 3లో నాగార్జునకు ఎపిసోడ్‌కి రూ. 12 లక్షలు, 15 వారాలు (దాదాపు వందరోజులు) కావడంతో రూ. 5 కోట్ల మార్క్ చేరుకున్నారు కింగ్. అయితే సీజన్ 4కి వచ్చేసరికి రూ. 8 కోట్లు వరకూ చార్జ్ చేస్తున్నారట నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ అంటే వాళ్ల క్రేజ్‌ని బట్టి డిసైడ్ చేస్తుంటారు. గతంలో శ్రీముఖి లాంటి పాపులర్ సెలబ్రిటీలకు ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకూ రేటు పలికినట్టు వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com