మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ జంట...

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 05:46 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి వస్తున్నారనే విషయన్ని వెల్లడించడానికి తాము ఎంతో సంతోషిస్తున్నామని వారు తెలిపారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ సంయుక్తంగా ఒక ప్రకటనను వెలువరించారు.


కరీనా, సైఫ్ ఇద్దరూ కలిసి 'ఓంకారా', 'ఏజెంట్ వినోద్', 'ఖుర్బాన్' అనే చిత్రాల్లో నటించారు. ఈ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్న వీరికి 2016లో కుమారుడు జన్మించాడు. చిన్నారికి తైమూర్ అని వీరు పేరు పెట్టుకున్నారు. కరీనా చివరగా 'ఆంగ్రేజీ మీడియం' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె కరణ్ జొహార్, అమీర్ ఖాన్ లకు చెందిన రెండు ప్రాజెక్టుల్లో ఉంది. మరోవైపు సైఫ్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
Recent Post