కరోనాను జయించిన రాజమౌళి కుటుంబం...

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 06:54 PM

టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ లో వెల్లడించారు. కరోనా బారినపడిన తన కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు నెగెటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. "రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది. ప్రస్తుతం లక్షణాలేమీ లేవు. పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహిస్తే మా అందరికీ నెగెటివ్ వచ్చింది. ప్లాస్మా దానం చేయాలని చూస్తున్నాం. అయితే, డాక్టర్లు మూడు వారాలు ఆగాలని అన్నారు. ప్లాస్మా దానానికి తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందేందుకు సమయం పడుతుందని చెప్పారు" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
Recent Post