సోషల్ మీడియాలో హంగామా చేయడానికి రెడీ అవుతున్న మెగాఫ్యాన్స్..

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:07 PM

మన దేశంలో సినీ స్టార్లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడైతే పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, పూజలు, అన్నదానాలు ఇలా ఒకటేమిటి... ఎన్నో కార్యక్రమాలతో సెలబ్రేట్ చేసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. తమ అభిమాన హీరో హ్యాష్ ట్యాగ్, సీడీపీ (కామన్ డిస్ ప్లే పిక్చర్) ట్రెండింగ్ లో ఉన్నాయా? లేదా? అనేదే ఇప్పుడు ముఖ్యం.


ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హంగామా చేయడానికి మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. సీడీపీ కాకుండా... మరింత అడ్వాన్సుడు వర్షన్ అయిన సీఎంపీ (కామన్ మోషన్ పోస్టర్)ను రిలీజ్ చేయబోతున్నారట. దీని కోసం చిరంజీవి పీఆర్ టీమ్ ఒక వీడియోను రూపొందించింది. చిరు పుట్టినరోజుకు వారం ముందు అంటే ఆగస్ట్ 15వ తేదీన ఈ సీఎంపీని విడుదల చేయనున్నారు. ఇండస్ట్రీలోని 65 మంది ప్రముఖుల చేత దీన్ని సోషల్ మీడియాలో పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో ఈ పోస్టర్ ను విడుదల చేయిస్తున్నారట.
Recent Post