'బాపు బొమ్మకు పెళ్లి'...

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 13, 2020, 12:51 PM

సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక త్వరలో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఓ టీవీ షోలో పెళ్లి కూతురిగా ముస్తాబై కనపడి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ  షోలో నాగబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను వినాయక చవితి సందర్భంగా ఓ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి 'బాపు బొమ్మకు పెళ్లి' అనే టైటిల్ పెట్టారు. ఇందులో నిహారిక పెళ్లికి సంబంధించిన విశేషాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ''వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ... అంగరంగ వైభవంగా జరిగే 'బాపు బొమ్మకి పెళ్ళంట' వినాయక చవితి స్పెషల్ ... త్వరలో మీ జీ తెలుగులో..'' అంటూ ఆ ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


తన కూతురుని పెళ్లి కూతురిగా చూసి నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో యాంకర్ అనసూయ దంపతులు కూడా సందడి చేయనున్నారు. కాగా, గుంటూరు కుర్రాడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి ఇప్పటికే నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ నెలలోనే నిహారిక-చైతన్య ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని నాగబాబు కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.                              
Recent Post