నవదీప్ గ్రీన్ ఛాలెంజ్...

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 13, 2020, 01:24 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు అలీ రేజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు తన స్వగృహం జూబ్లీ హిల్స్‌లో  మొక్కలు నాటిన యువ నటుడు నవదీప్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నవదీప్ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ అదరగొడుతున్నాడు. దీంతో పాటు నవదీప్ అడల్ట్ స్టార్ సన్ని లియోన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. రాగిణీ MMS సిరీస్‌లో వస్తోన్న ఈ తాజా సినిమా త్వరలో అల్ట్ బాలాజీలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది.
Recent Post