నాగార్జున పిలిచిన `గోపీ ఎవరు` ...

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 13, 2020, 01:58 PM

గత మూడేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న `బిగ్‌బాస్` కార్యక్రమం నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సీజన్ కరోనా కారణంగా ఆలస్యమైంది. గత సీజన్‌ను హోస్ట్ చేసిన నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 


తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఓల్డ్ గెటప్‌లో దర్శనమిచ్చారు. బయోస్కోప్ పెట్టుకుని `గోపీ` అని పిలుస్తున్నారు. `తర్వాత ఏం  జరిగిందో తెలుసా` అంటూ ప్రోమోను ముగించారు. దీంతో `గోపీ ఎవరు` అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గత సీజన్‌లో కొతి బొమ్మ పట్టుకుని `పండు` అంటూ నాగ్ సందడి చేశారు. ఈ ఏడాది `గోపీ` అనే క్యారెక్టర్‌ను పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. 


 
Recent Post