అభిరామ్ ఆక్సిడెంట్ పై స్పందించిన సురేష్ బాబు...

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 13, 2020, 03:23 PM

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ కారు యాక్సిడెంట్ కు గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మణికొండలో అభిరామ్ కారు మరో కారును ఢీకొందని... అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం ఇరువురూ రాయదుర్గం పీఎస్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తలను ఆయన ఖండించారు. యాక్సిడెంట్ చేసింది తనకు కుమారుడు అభిరామ్ కాదని... ఆ కారు కూడా తన కుమారుడిది కాదని చెప్పారు.
Recent Post