ఆ సినిమా రీమేక్ లో పవన్..?

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 13, 2020, 05:13 PM

ఒక్కో సినిమా విషయంలో కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. ఫలానా సినిమాకి మొదట్లో ఒకర్ని అనుకోవడం.. ఆ తర్వాత మరొకరు సీన్లోకి రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఓ రీమేక్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.


మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ హక్కుల్ని తీసుకుంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం చాలాకాలం బాలకృష్ణ కోసం ప్రయత్నించారు. అయితే, ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఆ తర్వాత రవితేజ కోసం కూడా ట్రై చేసినట్టు వార్తలొచ్చాయి. ఆయనా దీనికి ఓకే చెప్పలేదు.


ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోంది. ఆయన కోసం నిర్మాత సీరియస్ గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఈ చిత్రాన్ని పవన్ కు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారట. ఆయన ఆసక్తికరంగా తిలకించారని అంటున్నారు. ఇక ఈ కథకు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నిర్మాత అప్పజెప్పినట్టు సమాచారం. ఆ దర్శకుడే ఈ ప్రాజక్టులోకి పవన్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఇది కార్యరూపం దాలుస్తుందా? లేదా? అనేది చూడాలి!
Recent Post