మరో హీరోయిన్ కి కరోనా పాజిటివ్..!

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 06:04 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేగాకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ అందరికీ సోకి, జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌలి కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. మలయాళ హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. కాగా ఆమె తెలుగులో కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించారు.
Recent Post