ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“గుడ్ లక్ సఖి” టీజర్ రిలీజ్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 12:34 PM



“మహానటి” చిత్రంతో అద్భుతమైన పెర్ఫామెన్స్ ను కనబర్చి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తనకంటూ ఒక చిరునామాను ఏర్పర్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. అక్కడ నుంచి చాలా చిత్రాలను చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరో చిత్రంతో రావడానికి సిద్ధంగా ఉంది. అదే “గుడ్ లక్ సఖి”.  ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో రానున్న ఈ చిత్రం తాలూకా తెలుగు టీజర్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు విడుదలైంది. ఈ టీజర్ ను గమనించినట్టైతే సినిమాపై మంచి అంచనాలు ఏర్పర్చుకోవచ్చనిపిస్తుంది. ఓ మారు మూల ప్రాంతానికి చెందిన ఓ అల్లరి అమ్మాయిలోని ప్రతిభను వెలికి తీసి జాతీయ స్థాయి రైఫెల్ షూటింగ్ లో పాల్గొనేలా తీర్చిదిద్దిన ఈ సినిమా టీజర్ చూడడానికి ఆహ్లాదంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com